మన దేశంలో క్రికెట్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్లను దేవుళ్ళుగా చూస్తూ ఉంటారు. ఇలా క్రికెట్ లో ఉన్న ఎన్నో అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. క్రికెటర్లు వాడే బ్యాట్, ప్యాడ్, హెల్మెట్, జెర్సీ, బాల్, షూస్, స్టంప్స్, బెయిల్స్, గ్లోవ్స్ ఇలా ఎన్నో విషయాల గురించి చర్చ ఉంటుంది. ఏవి పడితే అవి వాడితే మ్యాచ్ ఫలితం మీద కూడా ప్రభావం పడుతుంది.
క్రికెట్ మ్యాచ్ లో అత్యంత ప్రభావం చూపించేంది బంతి. ఈ బంతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఏ కంపెనీ బంతి వాడాలి అనే దాని మీద అవగాహనతో ఉంటారు. ఇలా ఏ బంతి వాడతారు, దాని ధర ఏంటీ అనేది చూద్దాం. కూకబుర్రా తయారు చేసిన టర్ఫ్ వైట్ బాల్ ను టి 20తో పాటు వన్డే ఫార్మాట్ లో వాడతారు. పరిస్థితిని బట్టి, ఆడే దేశాన్ని బట్టి బ్రాండ్ మారుతుంది. డ్యూక్, ఎస్జీ మన ఆసియాలో ఎక్కువ వాడతారు.
రెడ్ బాల్ ను టెస్ట్ ఫార్మాట్ లో వాడతారు. కూకబుర్రా టర్ఫ్ వైట్ బాల్ ధర సుమారు 15 వేల వరకు ఉండే అవకాశం ఉంటుంది. రెడ్ బాల్ తో పోలిస్తే దీని నాణ్యత ఎక్కువ అంటారు. వెబ్ సైట్ ను బట్టి ధరలు ఉన్నాయి. మొత్తంగా 13 నుండి 17 వేల వరకు దీని ధర ఉంటుంది. ఇక టెస్ట్ మ్యాచ్ లో ఉపయోగించే రెడ్ లెదర్ బాల్ ధర అయితే 3-4 వేల నుండి ఉండే అవకాశం ఉంది.