సోషల్ మీడియాలో ఒక్కసారి ఫాలోయింగ్ వచ్చింది అంటే చాలు ఇప్పుడు లైఫ్ సెట్ అన్నట్టు ఉంది పరిస్థితి. టాలెంట్ ను బయట పెట్టుకోవడానికి సోషల్ మీడియా అనేది మంచి ఫ్లాట్ ఫాం గా ఉంది అనే చెప్పాలి. అలా ఫేమస్ అయిన వారిలో గంగవ్వ ఒకరు. యూట్యూబ్ లో చేసిన వీడియో లు ఆమె లైఫ్ ను మార్చేశాయి. ఆ ఫాలోయింగ్ తో ఆమెకు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.
ఇక బిగ్ బాస్ లో కూడా ఆమెకు అవకాశం రావడం ఒక సంచలనం. అక్కడ వచ్చిన డబ్బులతో ఆమె ఇల్లు కూడా కొనుక్కున్నారు. ఇప్పటికీ ఆమె యూట్యూబ్ లో వీడియో లు చేస్తూ పల్లెటూరు వాతావరణం చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె సంపాదన ఎంత ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ లో వర్క్ చేసే వారికి ఖర్చులు పోను నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం సంపాదిస్తుంది.
సినిమాల్లో కూడా అవకాశాలు రావడంతో ఒక్క రోజుకి పది వేల వరకు తీసుకుంటున్నారు. త్వరలోనే వంటల ఛానల్ కూడా ఆమె స్టార్ట్ చేసే అవకాశం ఉందట. ఏదోక విధంగా నెలకు రెండు లక్షల వరకు ఆమె సంపాదిస్తున్నారు అనే టాక్ వినపడుతుంది. త్వరలోనే ఒక సినిమాలో మంచి పాత్ర పోషించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.