నిమిషాల్లో 2 కోట్లు సొంతమైతే.. అదెలా అనుకుంటున్నారా.. ఈ గోల్డెన్ ఛాన్స్ కొట్టేయాలంటే కాస్త కష్టపడక తప్పదు. వెసువియన్ పర్వతం విస్పోటనం సమయంలో కాలిపోయిన 2000 సంవత్సరాల నాటి మాన్యుస్ర్కిప్ట్ లను చదవాలి. అలా చదవగలిగే వారికి శాస్త్రవేత్తలు రెండు కోట్లు ఇస్తారు.
క్రీస్తుశకం 79 లో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా పాంపీ పేరు కనుమరుగైపోవడంతో హెర్క్యులేనియం లైబ్రరీ లో చాలా రహస్యమైనవిగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఈ రహస్య పజిల్ ను పరిష్కరించడానికి ఒక పోటీని ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని పదాల చిత్రాలు, ఆ గ్రంథాల చిహ్నాలు సేకరించారని ఆయన చెప్పారు.
దీనితో పాటు ఈ 2000 సంవత్సరాల పురాతన గ్రంథాలపై రాసిన పదాలను చదివి అర్థం చేసుకోగలిగిన వ్యక్తికి 250,000 డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నామని ఆయన తెలియజేశారు. ఇక పరిశోధకులు ఇందుకు ఉపయోగపడే సాఫ్ట్ వేర్ ను కూడా విడుదల చేశారు. ఇది కృత్రిమ మేధస్సును మెరుగుపరచడంలో 60 నుంచి 80 శాతం వరకు సహాయపడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల బృందాలు ఈ రహస్యాన్ని ఛేదించడంలో సహాయపడతారని ఆయన ఆశిస్తున్నారు. తాము నిర్వహిస్తున్న ఈ పోటీలో ఈ ఏడాది చివరి నాటికి ఈ మాన్యుస్క్రిప్ట్ లోని మొదటి 4 భాగాలను చదవగలిగిన వారికి ఈ బహుమతి అందచేస్తామని సైంటిస్ట్ సీల్స్ వెల్లడించారు.