ఏదైనా చేయాలనుకున్నాడు. కేజీఎఫ్ సినిమాలో ఉన్న హీరో రాఖీ బాయ్ రోల్ ను ప్లే చేయాలనుకున్నాడు. ఆ కిక్కే వేరప్పా అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే.. కటకటాల్లోకి వెళ్లాడు. అది కూడా తన చిన్న నాటి స్నేహితుడినే పొట్టన పెట్టుకున్న నేరానికి.
జనవరి 22 న జియాగూడలోని నడిరోడ్డుపై జరిగిన మర్డర్ కేసును ఛేదించిన పోలీసులకు దిమ్మ తిరిగింది. సాయినాథ్ అనే వ్యక్తి హత్యకు గురికాగా నిందితులైన ఆకాష్, సోనూ,సాయికుమార్ లను పోలీసులు రిమాండ్ కు తరలించారు. గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్, కుల్సుంపురా సీఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు సాయినాథ్ అంబర్ పేట్ లో గ్లాస్ కటింగ్ వ్యాపారం చేస్తున్నాడు.
జియాగూడకు చెందిన ఆకాష్, సాయినాథ్ చిన్ననాటి స్నేహితులు పదో తరగతి వరకు అంబర్ పేట్ లో కలిసి చదువుకున్నారు. ఆకాష్ ఆ తర్వాత జియాగూడకు మకాం మార్చాడు. అయితే తరుచూ స్నేహితులంతా పార్టీలు చేసుకునేవారు. ఆకాష్ కు భాయ్ కావాలని బలమైన కోరిక ఉండేది. ఇటీవల కేజీఎఫ్ సినిమా చూశాక ఆ కోరిక మరింత బలపడింది. అయితే సాయినాథ్ కు ఆకాష్ ఇచ్చిన లక్ష రూపాయల అప్పుకు సంబంధించి వడ్డీ విషయంలో గత కొన్ని రోజులుగా గొడవ నడుస్తోంది.
వడ్డీ డబ్బులు అడిగినప్పుడల్లా సాయినాథ్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు. ఈ నేపథ్యంలో సాయినాథ్ పై పగ పెంచుకున్న ఆకాష్ చంపాలని ప్లాన్ వేశాడు. ఇందుకు తన స్నేహితులు సోనూ, సాయికుమార్ లతో పథకం వేశాడు. జనవరి 22 న సాయినాథ్ ను జియాగూడకు మాట్లాడుకుందాం అని చెప్పి పిలిపించి.. తన వెంట తెచ్చుకున్న రెండు కొడవళ్లు,రాడ్డుతో సాయినాథ్ పై విచక్షణ రహితంగా దాడి చేసి కిరాతకంగా చంపేశారు. అయితే తరువాత పోలీసుల విచారణలో అంతా బట్టబయలైంది.