అసదుద్దీన్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టాలెంట్ ఎవరి సొత్తు కాదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ నాలుగు సంవత్సరాలుగా రన్ చేస్తున్నామన్న కేటీఆర్.. వినూత్న ఆలోచనలతో ఔత్సాహిక యువకులు ఎవరు ముందుకు వచ్చినా తాము సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు.
ఇమేజ్ టవర్స్ ను 2023 లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రేపు సాయంత్రం దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టీ వర్స్క్ ను ప్రారంభిస్తామన్నారు. ఇక్కడ వందల వేల స్టార్టప్ లు పనిచేస్తాయన్న మంత్రి కేటీఆర్.. టీ వర్స్క్ ఫేజ్ 78 వేల ఎస్ ఎఫ్టీ లో నిర్మించామని తెలిపారు.
గ్రామీణ ప్రాంత ఓత్సాహిక యువతకు టీ వర్స్క్ ఉపయోగపడుతుందన్న కేటీఆర్.. డిజైనింగ్ ఇన్నోవేషన్, మెటిరియల్ సైన్స్ పై విద్యార్థుల్లో అవగాహన పెంచాలని సూచించారు. తరువాత టీ వర్స్క్ లో కేటీఆర్ ను ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిశారు. కాగా ఆయన వియ్యంకుడు డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత మంత్రి కేటీఆర్ ను ఓవైసీ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.