టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో జరిగే ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా రమ్మంటూ సామ్ కు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం ఆగస్టు 12వ తేదీన జరుగనుంది.
దీంతో సామ్ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇక ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తార అనతి కాలంలోనే టాలీవుడ్ స్టార్ హోదా సంపాదించుకుంది. కొద్దికాలం క్రితం విడాకులు తీసుకున్న సామ్ ఆ తరువాత వరుస సినిమాలు, యాడ్ లు చేన్తూ బిజీ అయిపోయింది.
తనకు ఇలాంటి పిలుపు రావడంతో భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సామ్ తెలిపింది. దీంతో సమంత అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సమంత పుష్ప చిత్రం లో ఐటమ్ సాంగ్ చేయగా దానికి మంచి గుర్తింపు లభించింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సామ్ కి ఈ ఆహ్వానం అందడం ఆనందించదగ్గ విషయం.