విజయవాడ: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంగాయమ్మ ఐవీఎఫ్ వ్యవహారంపై ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వృద్ధురాలికి ఐవీఎఫ్ చేసిన వైద్యులపై మండిపడింది. ‘74 ఏళ్ళ వయసున్న వృద్ధురాలికి ఐవీఎఫ్ చేయడం బుద్దిలేని పని’ అని ఐఎఫ్ఎస్ వ్యాఖ్యానించింది. చట్టాన్ని ఆ వైద్యులు అతిక్రమించారని ఆక్షేపించింది. చట్ట ప్రకారం 18 ఏళ్ల లోపు యువతులకు 45 ఏళ్లు దాటిన మహిళలకు ఐవీఎఫ్ చేయకూడదని ఫెర్టిలిటీ సొసైటీ క్లారిటీ ఇచ్చింది. వైద్య నిబంధనలను అతిక్రమించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని సొసైటీ వార్నింగిచ్చింది.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » ఆ కాన్పు చట్టవిరుద్దం