ఐఐటీ మద్రాస్ ను కరోనా కేసులు వణికిస్తున్నాయి. ఇప్పటి వరకు ఐఐటీలో మొత్తం 171 మంది కరోనా బారిన పడినట్టు వైద్యశాఖాధికారులు వివరించారు.
ఇప్పటి వరకు క్యాంపస్ ను మూసివేయలేదని తమిళనాడు వైద్యశాఖ కార్యదర్శి రాధకృష్ణన్ తెలిపారు. క్యాంపస్ నుంచి కరోనా ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చూసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
‘ క్యాంపస్ లో ఇప్పటి వరకు మొత్తం 171 కరోనా కేసులు నమోదయ్యాయి. విద్యార్థులకు సాచ్యురేషన్ టెస్టులు నిర్వహించగా ఈ కేసులు బయటపడ్డాయి’ అని ఆయన వెల్లడించారు.
ఐఐటీలో కరోనా కలకలం నేపథ్యంలో విద్యార్థులు, ప్రజల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని ఆయన సూచనలు చేశారు.