తమిళనాడులోని మద్రాస్ ఐఐటీ క్యాంపస్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రెండు రోజుల్లోనే అక్కడ వంద మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది ఈ మహమ్మారి బారినపడ్డారు. నిన్న క్యాంపస్‌లో
71 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఇవాళ కొత్తగా మరో 33 మందికి సొకింది. దీంతో మొత్తం 104 మందికి రెండు రోజుల్లోనే ఈ వైరస్ బారినపడ్డారు. మొత్తం క్యాంపస్‌లో 700 మంది ఉండగా.. అందులో ఇప్పటికే 444 మందికి కరోనా వచ్చినట్టు అధికారులు తెలిపారు.
డిసెంబర్ 1 నుంచి 12 వరకు చేసిన టెస్టుల్లో ఈ కేసులన్నీ బయటపడినట్టు వారు చెప్తున్నారు. సీఎం పళనిస్వామి ఆదేశాలతో బాధితులందరినీ కింగ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ చేర్చి చికిత్స అందిస్తున్నారు. క్యాంపస్‌లో వందల మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.