‘రెండక్షరాల ప్రేమ.. రెండు క్షణాల ప్రేమ..’ గజదొంగ రాఘవేంద్రరావు మూవీలో యన్టీఆర్ పాట ఇది. ఈ పాటలోని ఇన్నర్ మీనింగ్ ఇప్పుడున్న పరిస్థితులకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. ఇద్దరూ ఒక్కరయ్యే దాకా ఆగలేరు. మళ్లీ ఆ ఇద్దరే ఎవరికి వారుగా వేరు వేరు అయ్యేవరకూ కూడా ఆగడం లేదు. అదే ఇప్పుడు టాపిక్.
బాలీవుడ్ బ్యూటీ ఇలియానా కెరీర్ టాప్ రేంజ్‌లో ఉండగానే లవ్‌లో పడింది. విదేశీ అండ్రూతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. చివరకు పెళ్లి చేసుకుంది. మూవీల్లో ఇక నటించనని చెబితే పెళ్లికి ముందు అండ్రూ ఒకే అన్నాడు. కొన్నాళ్ళు కాపురం బాగానే సాగింది. మనీ ఉన్నంత కాలం, ఇల్లీ ఖర్చు పెట్టుకున్నంత కాలం ఫామిలీ భలేగా ఉంది.
ఇక డబ్బు అయిపోయే సరికి అండ్రూ అసలు రంగు బయట పడింది. డబ్బు తెస్తావా..? లేదా..? అనే డిమాండ్ కాపురంలో చిచ్చు రేపింది. సినిమాలు చేసి డబ్బు సంపాదించాలని ఒకటే ఒత్తిడి. ఈ టార్చర్ ఇలియానా మాత్రం ఎన్నాళ్లని భరిస్తుంది? బ్రేకప్ చెప్పేసింది. ఇంతేలే ఈ ప్రేమలు-పెళ్లిళ్లు.. అనుకుంటూ ఇల్లీగాళ్ ఇప్పుడు సోలో సాంగ్ పాడుకుంటోంది. మరిప్పుడు వాట్ నెక్స్ట్? ఇలియానా ఏం చేయబోతోంది ? మళ్లీ మూవీల్లో నటిస్తుందా..?
అయినా చేతులు కాలాక చింతిస్తే ఏముంది..? గ్లామర్ ఫీల్డ్‌లో ఎందుకో.. ఏమో అంతా ఇలా దగా పడుతూనే ఉన్నారు. సావిత్రి నుంచి ఇల్లీ వరకు ఇదే కథ.. ఇంతే కదా! సెకండ్ హాండ్ భర్తలు, సెంటిమెంట్ లేని బిజినెస్ మైండెడ్ ఫెలోస్.. తెలుసుకోండమ్మా…!?