దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరుతెచ్చుకున్న బ్యూటీ ఇలియానా. తన అందంతో, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. ఆ తరువాత టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ సినిమాలు తీసినప్పటికి ప్రస్తుతానికి తెలుగు లో అవకాశాలు ఏమి లేకపోవటంతో బాలీవుడ్ లో ఈ అమ్మడు సినిమాలు చేసుకుంటుంది.
తాజాగా ఈ గోవా బ్యూటీ తన లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయ్యింది. తన లవ్ బ్రేక్ అప్ అయ్యిందని, లవ్ లో ఉండటం వల్ల కొంచెం లావుగా కూడా అయ్యాను, మళ్ళీ సన్నబడే పనిలో ఉన్నానని ఇలియానా చెప్పుకొచ్చింది. నా లవర్ తో నేను విడిపోయాను, అయన నన్ను వదిలి వెళ్లిపోయారు, నేను ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నాను. అతనికీ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఇక పై ఎవ్వరిని ప్రేమించను నన్ను నేనే ప్రేమించుకుంటా అని చెప్పుకొచ్చింది ఈ బామ. ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ కీబోనేతో లివ్ ఇన్ రిలేషన్ ని మైంటైన్ చేసిన ఇలియానా, ఆగస్టులో అతని నుంచి విడిపోయింది.