హాట్ బ్యూటీ ఇలియానా అస్వస్థతకు గురైంది. తాను అనారోగ్యంగా ఉన్నానంటూ.. హాస్పటల్ బెడ్ పై సెలైన్ తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఒకదానికి ఒక రోజు ఎంత మార్పు తీసుకువస్తుంది అంటూ రాసుకొచ్చింది. మరొక దానికి కొంత మంది డాక్టర్లు, మూడు ఐవీ ఫ్లూయిడ్ బ్యాగ్స్ అంటూ క్యాప్షన్ రాసింది.
దీంతో ఇల్లీ బేబీకి ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని నెటిజన్లు మెసేజ్ లు పెడుతున్నారు.
ప్రస్తుతం ఇలియానా సిలైన్ బాటిల్ తో హాస్పటల్ బెడ్ పై ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తెలుగులో పోకిరి, జల్సా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సాధించింది ఇలియానా.