అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై ఉక్రెయిన్ ఎంపీ ఇన్నా సోవ్ సన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రష్యా దాడులను ఎదుర్కోవడంలో తూర్పు యూరప్ దేశం ఉక్రెయిన్ కు బైడెన్ తగిన సహాయాన్ని చేయడం లేదంటూ ఆమె మండిపడ్డారు.
ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అమెరికా నుంచి సరైన సహాయం అందుతున్నట్టు ఉక్రెయిన్ ప్రజల్లో భరోసా కల్పించేలా బైడెన్ ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదని మండిపడ్డారు.
ఇప్పుడు ఆయన పోలాండ్ కు మరోసారి భరోసా ఇవ్వడం తనకు ఆనందం కలిగించిందన్నారు. కానీ ఇప్పుడు బాంబులు పడుతున్నది కీవ్, ఖార్కివ్ నగరాల్లోననిచ, పోలాండ్ రాజధాని వార్సాలో కాదని ఆమె అన్నారు.
రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3.7 మిలియన్ల మంది ఉక్రెయిన్ విడిచిపెట్టి పారిపోయినట్టు ఐరాస తెలిపింది. మొత్తం 3,772,599 మంది ఉక్రెయిన్ నుంచి పారిపోయినట్టు ఐరాస వెల్లడించింది.
వీరిలో అత్యధికంగా మహిళలు ఉన్నట్టు యూఎన్ఓ ప్రకటించింది. యుద్దం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ లో సుమారు 6.5 బిలియన్ల మంది పౌరులు నిరాశ్రయులు అయినట్టు యూఎన్ఓ పేర్కొంది.