ఆరు నెలల జీతం ఇవ్వకుండా మహిళా వాచ్ ఉమెన్ ఇంటికి తాళం వేసి బయటికి నెట్టేశారు అపార్ట్ మెంట్ నిర్వాహకులు. తాడేపల్లిలో వాచ్ ఉమెన్ గా పని చేస్తున్న ఓ మహిళ తనకు న్యాయం చెయ్యాలంటూ పోలీసులను ఆశ్రయించింది. అపార్ట్ మెంట్ లో ఓ మహిళా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుందని తనుకు ఆ తెలిసినందుకే నన్ను నెట్టి వేస్తున్నారంటున్న బాధిత మహిళ ఆరోపిస్తుంది.
గతంలో తాడేపల్లి బైపాస్ ఏరియాల్లో పలు అపార్టమెంట్ ల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకున్న సందర్బాలు అనేకం ఇప్పుడు ఆర్ కె రెసిడెన్సీలో కూడా అదే పరిస్థితిలు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. మెయిన్ రోడ్డుకు కాస్త దూరంలో ఉన్న ఈ అపార్ట్ మెంట్ లో రాత్రి పొద్దుపోయిన తర్వాత ముసుగులు ధరించిన కొంతమంది యువతీ, యువకులు ఆటోల్లో, కార్లలో వచ్చిపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది.