అది 2004 వ సంవత్సరం. టీవీ అంటే కేవలం వినోదం కోసం మాత్రమే ఉండేది. ఎప్పటికప్పుడు ఎక్కడ ఎం జరిగినా తెలుసుకోవాలంటే తెల్లారి పత్రికలు చూస్తే కానీ తెలిసేది కాదు. అప్పుడే రవి ప్రకాష్ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. 24 గంటల న్యూస్ ఛానెల్స్ కి శ్రీకారం చుట్టాడు. ఒక రకంగా సాహసమే చేశాడు. అప్పటికే తన రిపోర్టింగ్ తో, ఇంటర్వ్యూ లలో అవినీతి పరుల గుండెల్లో నిద్రపోయాడు.బషీర్ బాగ్ కాల్పులు ప్రపంచానికి చూపించి ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎండగట్టారు. కష్టపడి తను ఇష్టపడ్డ జర్నలిజానికి ఊపిరి పోశాడు.ఎలక్ట్రానిక్ మీడియా ను విశ్వవ్యాప్తం చేశాడు.
టీవీ9 ఛానెల్ ప్రారంభించాడు. ప్రజల సమస్యలే రవి ప్రకాష్ ప్రధాన అజెండా. అది ప్రస్ఫుటంగా టీవీ9 లో కనిపించింది.ఆపదలో ఉన్న ప్రజలను తన సంస్థ ద్వారా ఆదుకున్నాడు. ఆ తరువాత ఎన్ని న్యూస్ ఛానెల్స్ వచ్చినా టీవీ9 తరువాతే. 15 సంవత్సరాలు టీవీ9 ను నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత రవి ప్రకాష్ దే. ఇది ఇప్పుడు కబ్జా చేసిన దోపిడీ దారులకు అర్థం కాకపోవచ్చు. కానీ తెలుగు సమాజానికి, జర్నలిస్ట్ లోకానికి తెలుసు.దట్ ఈజ్ రవి ప్రకాష్. టీవీ9 అంటే రవి ప్రకాష్, రవి ప్రకాష్ అంటే టీవీ9 .ప్రపంచంలో ఉన్న ఏ తెలుగు వాడిని అడిగినా ఇదే చెప్తాడు.టీవీ9 లో చేరాలన్నది ప్రతి ఒక్క జర్నలిస్ట్ కల. జర్నలిస్టులను రవి ప్రకాష్ చూసుకున్న తీరు అద్భుతం. ఏ ఛానెల్ లో లేని జీతాలు టీవీ9 లో ఉండేవి. ఇది కేవలం రవి ప్రకాశ్ నిఖార్సైన జర్నలిస్టులతో కలిసి నిర్మించిన సామ్రాజ్యం. జర్నలిస్టులు బాధ్యతగా, ధైర్యంతో పనిచేయడానికి ప్రధాన కారణం ఛానెల్ యజమాని కూడా జర్నలిస్ట్ కావడం. ఇప్పుడు పేదల భూములను కబ్జా చేసిన వారు, ప్రజల సొమ్మును లూటీ చేసిన వారు అధినేతలు. ఇక్కడ జర్నలిజం బతకదు. జర్నలిస్టులు దిక్కు తోచని పరిస్థితిలో కి వెళ్ళిపోతారు. జరుగుతోంది అదే. ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయిన మీడియా అంగట్లో సరుకులా మారిపోయింది.
కేసులతో రవి ప్రకాష్ ను మానసికంగా కుంగదీసి, అసలు మీడియాలో లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. నవ్వాలో?? ఏడవాలో ?? అర్థం కావట్లేదు. రవి ప్రకాష్ ను పూర్తిగా చదివిన వాడికి ఆయనకు ఉన్న గుండె ధైర్యం, ఆయనలో ఉన్న మానవత్వం అర్థం అవుతుంది. కష్టపడి పైకొచ్చిన రవి ప్రకాష్ దేనికి భయపడ డు…అది చావైన సరే. అంతకు మించిన ధైర్యం రవి ప్రకాష్ సొంతం.
వైద్యానికి నోచుకోని పేదలకు హాస్పిటల్ కట్టిస్తే దాన్ని కూడా రాజకీయం చేసే వ్యభిచారులకు ఎం అర్థం అవుతుంది చెప్పండి.మీరు ఆలోచన ఒక్కటే
రవి ప్రకాష్ సమయాన్ని వృధా చేసి, ఓపికకు పరీక్ష పెట్టాలనే భ్రమలో ఉన్నారు. మీ భ్రమలు తొలగిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఆ అవిశ్రాంత ధీరుడు వూరికే జైల్లో కుర్చోడు.
ప్రజల కష్టాల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కష్టాల వెనకున్న కబ్జా కోరుల భరతం పట్టడానికి అగ్ని పర్వతాల్లాంటి ఆలోచనలు చేస్తుంటాడు. ప్రజల ముందుకు వస్తాడు.
న్యాయ వ్యవస్థను నముకున్న రవి ప్రకాష్ సూర్య కాంతితో మనముందుకొస్తాడు.
జర్నలిజాన్ని దృడ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తాడు.