• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

జర్నలిస్ట్‌లపై అక్రమ కేసుల సాక్ష్యాలివిగో…!

Published on : October 30, 2019 at 9:49 am

జర్నలిస్ట్‌లపై అణచివేత ఎలా చేస్తున్నారు… పోలీస్‌లు ఎలా జర్నలిస్ట్‌లను వేధించి, కుట్రలు చేస్తున్నారు… న్యాయస్థానాలను సైతం ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు… అనే అంశాలను వివరిస్తూ… సీనీయర్ జర్నలిస్ట్‌ అన్నంచిన్ని వెంకటేశ్వరరావుపై ఎలా కేసులు నమోదు చేసి వేధిస్తున్నారో పరిశోధాత్మక కథనం ఇది.

అన్నంచిన్ని వెంకటేశ్వరర్రావు పరిశోధాత్మక కథనం యాధావిదిగా…

అనంచిన్నిపై కుట్ర కేసు-6
అక్షర పిడుగులను ఆపే గొడుగులు ఉన్నాయా…?
◆ న్యాయదేవత కళ్ళకు ఖాకీ గంతలు..!
◆ పిర్యాదుకన్నా ముందే ఎఫ్.ఐ.అర్
◆ దేశ చరిత్రలో తొలిసారి
◆ అక్షరాలే ఆయుధాలు
◆ ఆయన మాటే శాసనం
◆ ఆ ‘సహనం’ నేర్చుకోండిర్రా…
(పురుషోత్తం, ఉదయ అక్షరం)
పిడుగులను ఆపే గొడుగులు ఉన్నాయా…? అక్షరాలను పిడుగులుగా మార్చి జోరుగా వర్షంలా… సునామీలా కురిపిస్తుంటే…. ఆపి వేసే దమ్ము, ధైర్యం అవినీతి గొడుగులకు ఉన్నాయా…? ల్లేవ్…ఉండవ్… ఉండబోవ్…. ‘అనంచిన్ని’ కలంలో ‘సిరా’ అయిపోదు. ఆయనకు అలపు రాదు. కుటుంబంతో తన వ్యక్తిగత వాహనంలో… జాతీయ రహదారిపై వెళుతూ… మధ్యలో వాహనాహన్ని (ఇంజన్ ఆన్ లో) ఉంచి… దమ్మున్న వార్తలను (రూపాయి ఆశించకుండా. ) పంపే అనంచిన్నిపై పెట్టిన తొలి కేసు…చరిత్ర చవి చూస్తే… యావత్ ప్రపంచం నెవ్వెరపోతుంది. ఖాకీలు, ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకునే దౌర్భాగ్యాపు కేసు… ఖమ్మంలో ప్రారంభమైంది. ఇదే అన్ని ఖాకీ కేసులకు మూలం. ఆ తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం దిగ జారిన కేసులు. ఆ విషయాలు అర్థం చేసుకోలేని ‘నల్లి శ్యాం’ ‘పట్నాయక్’, అందవిహీన దేవతావస్త్రాలు ధరించిన నెరజాణ… లాంటి చవట సన్నాసుల కోసం ఈ పరిశోధన కథనం.

ఇదీ కథ:

2013, ఆగస్టు15వ తేది దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని ఒకటవ టౌన్ పోలీసు స్టేషన్… దేశం నెవ్వెరపోయే కుట్రకు తెర లేచింది. ఎఫ్.ఐ.ఆర్, ఇతర ప్రక్రియలకు రోజుల తరబడి చేసే పోలీసులు ఈకేసులో కేవలం 11 నిమిషాలలో ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడం గమనార్హం. ఉదయం ఆరు గంటలకు పిర్యాదు. జనరల్ డైరిలో ఎంట్రీ, వెంటనే ఎఫ్.ఐ.ఆర్. ఆ వెంటనే పంచనామాలు పూర్తి. 200 కి.మీ. దూరంలోని హైదరాబాద్ లోని నిదింతుని ఇంటకు ఉదయం 6.11 నిమిషాలకే చేరుకున్న పోలీసులు. ఇది ఎలా సాధ్యం అని అడిగితే వారు వచ్చిన ట్రాన్స్ ఫోర్ట్ లేఖను ముచ్చటగా మూడుసార్లు అందించారు. అందులోని కేసు వివరాలలోకి వెళితే అది పోలీసుల చేతులలో ముగిసిన కేసుగా తేలింది.

హైకోర్టు ఆదేశాలా.. అయితే ఏంటి..?:
ఈ కేసులో ‘అన్ని చర్యలు ఆపుచేయాలని’ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబరు 4వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు అటు పోలీసుశాఖకు, ఇటు న్యాయశాఖకు అదే నెల 17న అందాయి. అయితే తాము చాలా .. చాలా గొప్పోళ్ళమని భావించే ఖాకీ ఉద్యోగి హైకోర్టు ఆదేశాలను ‘త్రోసి రాజు’ అంటూ 19వ తేదీన చార్జిషీట్ వేశారు. అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన న్యాయాధికారులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తాము ప్రతిదీ ఖచ్చితంగా చేశామని లిఖితపూర్వకంగా రాసి మరీ వ్యవస్థలన్నింటినీ నాలుగేళ్ళుగా పోలీసులు పక్కాగా నమ్మించారు. ఈ విషయాలన్నీ నాటి సి.. వెంకటేష్, ఈ కేసు విచారణ అధికార హోదాలో దృవీకరించి మరీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఏ.సి.పిగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పనిచేసి, ప్రస్తుతం మళ్ళీ ఖమ్మంలో పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంలో నాటి జిల్లా ఎస్పీ ప్రమేయం ఉన్నట్లు అనేకసార్లు బాధితుడు చెప్పాడు. ఆయన అరుపులు అరణ్య రోదనగా మిగిలింది. అంతా పోలీసులదే నిజమని నమ్మారు.

దటీజ్ హైకోర్టు:
‘ఏ పోలీసు స్టేషనులో అయిన ఎఫ్.ఐ.ఆర్. అయితే 24 గంటలలోగా సంబంధిత న్యాయస్థానావికి ఆ విషయాన్ని తప్పక తెలియజేయాలి’ అనే నిబంధన ఉంది. అన్యాయం తాత్కాలికంగా నిజమనే భ్రమలో ఉంచుతుంది. నిజం నిలకడ మీద తెలుస్తోంది. అన్న చందాన బాధితుడు న్యాయశాఖలోని రికార్డులు సంపాదించాడు. పిర్యాదు ఆగస్టు15, ఉదయం ఆరు గంటలకు ఎఫ్.ఐ.ఆర్. అయితే ఆ రోజు జాతీయ సెలవు దినం కావడంతో ఆగస్టు 16వ తేదీన న్యాయస్థానానికి ఆ ఎఫ్.ఐ.ఆర్ చేరాలి. కానీ ఆగస్టు 14న అవే సెక్షన్లు, అదే ఎఫ్.ఐ.ఆర్ అందినట్లు సంబంధి న్యాయాధికారి రిజిస్టర్ లో స్వయంగా సతంకం చేశారు. అంటే పిర్యాదు కన్న ఒకరోజు ముందే న్యాయస్థానానికి చేరింది.

తల దించుకోవాలి
చట్టాలను కాపాడాల్సిన పోలీసు అధికారి న్యాయ వ్యవస్థను తన ఇష్ఠారాజ్యంగా వాడుకున్న అసాధారణ సం‌ఘటన ఇది. భారతదేశ చరిత్రలో పోలీసు వ్యవస్థకు ఓ అధికారి కారణంగా తలవంపులు. అంతర్జాతీయ మీడియా ప్రశ్నలకు జవాబు చెప్పుకోలేని దుస్థితి. మేకపోతు గాంభీర్యం ఎందుకు.? తప్పు జరిగింది… న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించినట్లు ఒప్పుకునే ధైర్యం లేదు. దేశంలో‌ నేరగాళ్లు వందమంది తప్పించుకున్నా పర్వాలేదు. కానీ ఒక నిర్థోషికి శిక్ష పడకూడదనే అత్యున్నత ఆశయంతో మనదేశంలోని ప్రతి న్యాయస్థానం సగర్వంగా వందకోట్ల ప్రజానికానికి పెద్ద దిక్కుగా సేవలందిస్తోంది. సత్యం మాత్రమే పలకాలని జాతిపిత ఫొటో ప్రతి కార్యాలయంలో కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజా పన్నులతో జీతాలు పొందుతున్నారని తెలుసు. పోస్టుమ్యాన్, డ్రైవర్లు, గుర్ఖాలు, అటవీ అధికారులు, పోలీసులు ఖాకీ రంగు దుస్తులలో ఇలా ప్రతినిత్యం ప్రజలకు సేవలందించేవారే. మరి ఒక్క పోలీసు మాత్రమే న్యాయ వ్యవస్థకు ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తుంది. రక్షణ కల్పించడానికి మాత్రమే పోలీసు ఉద్యోగి అహర్నిశలు కష్టపడే వారెందరో ఉన్నారు. ఈ కథనం పోలీసుశాఖకు వ్యతిరేకం కాదు. అందులోని నీచ, నికృష్టులకు చెంపదెబ్బ లాంటిది. న్యాయ వ్యవస్థను వికృత అధికారులు ఎలా తప్పుదారి పట్టిస్తూ, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళారు. ప్రతిది పక్కాగా చేశామని ధీమాతో ఆ ఆధారాలన్నీ ఇచ్చారు. ఆరేళ్ళపాటు అనేక ఆధారాలను “అనంచిన్ని వెంకటేశ్వరరావు” సంపాదించారు. అందులో వీడియోలు కూడా ఉండటం విశేషం. ఈ కథనంలోని ప్రతి అక్షరం లిఖితపూర్వక ఆధారాలను సేకరించి అందిస్తున్నది. తెలుగు జర్నలిజంలో ఓ ట్రేడ్ మార్క్ స్టోరీ.

tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఈ నలుగురు నా కెప్టెన్స్...మెగాస్టార్

ఈ నలుగురు నా కెప్టెన్స్…మెగాస్టార్

కాంబో అదుర్స్...! కానీ పట్టాలెక్కుతుందా ?

కాంబో అదుర్స్…! కానీ పట్టాలెక్కుతుందా ?

ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆర్.ఆర్.ఆర్

ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆర్.ఆర్.ఆర్

బంగారు బుల్లోడు రిలీజ్ డౌటేనా ?

బంగారు బుల్లోడు రిలీజ్ డౌటేనా ?

అయోధ్య రామమందిరానికి పవన్ విరాళం ఎంతో తెలుసా ?

అయోధ్య రామమందిరానికి పవన్ విరాళం ఎంతో తెలుసా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

కేసీఆర్ నీ కోట గోడను బద్దలుకొడతాం

కేసీఆర్ నీ కోట గోడను బద్దలుకొడతాం

అఖిల‌ప్రియ‌కు బెయిల్- భ‌ర్త భార్గ‌వ్ రామ్ కు నో

అఖిల‌ప్రియ‌కు బెయిల్- భ‌ర్త భార్గ‌వ్ రామ్ కు నో

ఆ ముగ్గురు అధికారుల‌ను ఉన్న ఫ‌లంగా త‌ప్పించండి- స‌ర్కార్ కు నిమ్మ‌గ‌డ్డ ఆదేశం

ఆ ముగ్గురు అధికారుల‌ను ఉన్న ఫ‌లంగా త‌ప్పించండి- స‌ర్కార్ కు నిమ్మ‌గ‌డ్డ ఆదేశం

ఏపీలో మ‌ళ్లీ న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాలు

ఏపీలో మ‌ళ్లీ న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాలు

క్షీణించిన లాలూ ఆరోగ్యం- ఆసుప‌త్రికి చేరుకుంటున్న కుటుంబ స‌భ్యులు

క్షీణించిన లాలూ ఆరోగ్యం- ఆసుప‌త్రికి చేరుకుంటున్న కుటుంబ స‌భ్యులు

ఒక్క ఫొటోతో ప్రియురాలి పెళ్లి గోవిందా !! ప్రియుడు హ్యాపీ..

ఒక్క ఫొటోతో ప్రియురాలి పెళ్లి గోవిందా !! ప్రియుడు హ్యాపీ..

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)