తెలంగాణ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన సోమాజీగూడ యశోద హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నారు.
రెండ్రోజులుగా సీఎం కేసీఆర్ వీక్ గా ఉన్నారని.. ఎడమ చేయి లేవడం లేవడం లేదని సీఎం కేసీఆర్ డాక్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ట్రీట్ మెంట్ మొదలు పెట్టిన డాక్టర్లు..యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు చేశారు.
ఈ నేపథ్యంలోనే తన యాదాద్రి పర్యటనను రద్దు చేస్తున్నట్టు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు పర్యటించాల్సి ఉంది. అస్వస్థత కారణంగా పర్యటన రద్దైంది.
దీంతో నేడు జరగాల్సిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణ మహోత్సవానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన పట్టువస్త్రాలు సమర్పిస్తారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.