ఇల్మా అప్రోజ్ , IPS తన పేరు పక్కన ఆ మూడు అక్షరాలు చేరడం వెనుక ఎంతో కృషి ఉంది.. సాధించాలనే సంకల్పం ఉంటే మార్గం అదంతట అదే వస్తుంది అన్నదానకి ప్రత్యక్ష ఉదాహరణ ఇల్మా అఫ్రోజ్ స్టోరీ..ఎక్కడ కుందర్కి గ్రామం.. ఎక్కడ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటి..
ఉత్తరప్రదేశ్ లోని ముర్దాబాద్ కి చెందిన కుందర్కి గ్రామం ఇల్మా అఫ్రోజ్ ది.. పద్నాలుగేళ్లకే తండ్రి చనిపోయాడు..వ్యవసాయ కుటుంబం.. తల్లి ఒక్కర్తే ఇద్దరు బిడ్డల్ని చదివించింది.. తల్లి చదివించింది అనేకంటే ఇల్మా సంకల్పంతో చదువుకుంది అనడం కరెక్ట్.. భర్త మరణంతో కృంగిపోయిన ఇల్మా తల్లి పిల్లలను వదిలి క్షణం అయినా ఉండేది కాదు.. అటువంటి తల్లిని పై చదువులు చదువుకుంటానని ఒప్పించి ఢిల్లి పయనమైంది.
మా అన్న నా పెళ్లి కోసం డబ్బులు దాయలేదు, నన్ను చదివించడానికి కష్టపడ్డాడు అని గర్వంగా చెప్పుకుంటుంది ఇల్మా..ఢిల్లిలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లో ఫిలాసఫిలో డిగ్రి సీట్ సాధించింది..ఆ మూడేళ్లు ఇల్మా జీవితంలో చాలా ముఖ్యమైనవి..ఎప్పుడూ చదువులో లీనమైఉండేది.. ఏదో సాధించాలనే తపన ఇల్మాలో అక్కడ ప్రొఫెసర్స్ కి నచ్చే అంశం..ఆ తపనతోనే ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటి స్కాలర్ షిప్ పొందింది.. అతి కష్టంమీద విదేశాలకు పయనమైంది.
ఎక్కడ ఉత్తరప్రదేశ్లోని మారుమూల పల్లె..ఎక్కడ ఆక్సఫర్డ్ యూనివర్శిటి..అక్కడ చదువుతున్నప్పుడే పర్సనల్ ప్రాబ్లంస్ వల్ల ఇల్మా వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది..దాంతో పాటే ఒక ఆలోచన వచ్చింది..తన దేశం కోసం ఏం చేయగలను, ఏం చేయాలి అని..ఆలోచన వచ్చిందే తడవుగా ఇండియాలో అడుగుపెట్టగానే సివిల్స్ పై దృష్టి పెట్టింది..కష్టపడి చదివి ఫస్ట్ అటెంప్ట్ లోనే 217 ర్యాంక్ సాధించింది.హిమాచల్ ప్రదేశ్ క్యాడర్లో ఐపిఎస్ గా సెలక్ట్ అయింది. కుందర్కి గ్రామం నుండి ఆ స్థాయికి చేరుకున్న మొదటి అమ్మాయి.
ఇల్మా జీవితం నుండి మనం నేర్చుకోవాలసిన పాఠాలు.. తండ్రి చనిపోయినా, ఫైనాన్షియల్ గా సహకారం లేకపోయినా సాకులు వెతక్కుండా తన కృషి తను చేసింది..అమ్మాయిల చదువు గురించి సవాలక్షసార్లు ఆలోచించే ప్రాంతం నుండి వచ్చి ఎందరో అమ్మాయిల్లో స్పూర్తి నింపింది..మన కష్టాన్ని మనం నమ్ముకుంటే ఎప్పటికైనా మన గోల్ ని చేరుకోవచ్చనేదానికి ఇల్మా కథ ఒక ఉదాహరణ.. సాధించాలనే కసి ఉంటే మనలో కూడా ఎంతోమంది ఇల్మాలు ఉండొచ్చు..!