భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో గుడ్ బై చెప్పాడు. కానీ ఇప్పటికీ అతని పేరు మ్యాచ్‌లలో వినిపిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లో జరిగిన రెండో టీ20లోనూ ఆస్ట్రేలియా కెప్టెన్, వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ థోనీని గుర్తుకు తెచ్చాడు. శిఖర్ ధావన్ ను స్టంప్ అవుట్ చేయబోయిన సందర్భంలో వేడ్ ధోనీని గుర్తుకు తెచ్చుకున్నాడు.
ఎస్‌సీజీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా విసిరిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాట్స్‌మెన్ విజృంభించారు. అయితే భారత ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్వెప్‌సన్ ధావన్‌కు బంతిని విసరగా ధావన్ ఆ బంతిని కట్ చేయబోయి మిస్ అయ్యాడు. వెనుకే ఉన్న మాథ్యూ వేడ్ బంతిని అందుకుని స్టంప్ అవుట్‌కు యత్నించాడు. దీంతో థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. అయితే ధావన్ బంతిని మిస్ అయిన సందర్భంలో ఒక కాలుని కొద్దిగా ఎత్తి మళ్లీ క్రీజులోనే పెట్టాడు. కానీ ఆలోపు వేడ్ స్టంప్ అవుట్ చేయలేకపోయాడు. కొంత ఆలస్యం అయింది. దీంతో ధావన్ బతికిపోయాడు. అతన్ని థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు.
When cricketers become legends..
After the stumping act…Wade says
“Not #Dhoni…not quick enough like #Dhoni”— Priyanka Shukla (@PriyankaJShukla) December 6, 2020
Advertisements
అయితే ధావన్ నాటౌట్ అని తేలాక మాథ్యూ వేడ్ అన్న కామెంట్లు అక్కడే ఉన్న స్టంప్ మైక్‌లలో రికార్డు అయ్యాయి. నాట్ ధోనీ.. నాట్ క్విక్ ఎనఫ్ లైక్ ధోనీ.. అని వేడ్ అన్నాడు. ధోనీలా వేగంగా స్టంపౌట్ చేయాల్సిందనే అర్థంలో వేడ్ ఆ కామెంట్ చేయగా అందుకు ధావన్ నవ్వాడు. అయితే నిజానికి ఇలాంటి సందర్బాల్లో వికెట్లు తీయడంలో నిజానికి ధోనీకి ధోనీయే సాటి. గతంలో అనేక సార్లు బ్యాట్స్‌మన్‌ను ధోనీ సరిగ్గా ఇలాంటి సందర్బాల్లో స్టంపౌట్ చేశాడు. వికెట్ల వెనుక చాలా వేగంగా ఉండడమే కాదు, బ్యాట్స్ మెన్ క్రీజులో కాలు ఎత్తితే చాలు, వెంటనే స్టంపౌట్ చేయడంలో ధోనీ దిట్ట. అందుకనే వేడ్ అలా కామెంట్ చేశాడు. దీంతో ప్రస్తుతం అతను ధోనీ గురించి చేసిన కామెంట్ల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా రెండో టీ20లో భారత్ ఆస్ట్రేలియాపై పోరాడి గెలిచింది. హార్దిక్ పాండ్యా చివర్లో మెరుపులు మెరిపించడంతో భారత్ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో టీ20 మంగళవారం జరుగుతుంది.