కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలలో సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో దినసరి కూలీలు పరిస్థితి అలాగే నెలవారి జీతం తీసుకునే ఉద్యోగుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. తాజాగా హైదరాబాదులోని ఐమాక్స్ థియేటర్ లో ఆపరేటర్ గా పనిచేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూత పడటంతో మార్చి నుంచి సగం జీతం మాత్రమే తీసుకుంటున్నాడు. ఇకపై ఆ మాత్రం జీతాలు కూడా ఇవ్వలేమని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో కుటుంబం ఎలా సాగుతుందో ఆందోళనలో పడిపోయిన భాస్కర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఈ నేపథ్యంలోనే తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.