హైదరాబాద్‌కు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు చేసింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 24,25 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ఐఎండీ జారీ చేసింది.
ముఖ్యంగా నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం వున్నట్టు పేర్కొంది.
రాష్ట్రంలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. హైదరాబాద్‌లోని అన్ని సర్కిళ్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు చాలా వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు చెప్పింది.
మరోవైపు ఐఎండీతో పాటు, తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్ డీపీఎస్) కూడా తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అందువల్ల నగర వాసులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నాయి. అసరం ఉంటేనే బయటకు రావాలని సూచిస్తున్నాయి.