భారత వాతావరణ శాఖ (IMD) పిడుగు లాంటి వార్త చెప్పింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ మూడు నెలలు ఎండలు తీవ్రంగా ఉండబోతున్నాయని తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని శనివారం ఐఎండీ డైరెక్టరేట్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. అంతే కాకుండా పలు ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తాయని తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు దక్షిణ, వాయువ్య దేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా అనేక చోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని అన్నారు. బీహార్, ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, బెంగాల్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఈశాన్య, వాయువ్య భారతదేశంలోని భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకావశం ఉందని చెప్పారు ఐఎండీ డైరెక్టరేట్ మహాపాత్ర. ఏప్రిల్ లో సాధారణం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
అలాగే వాయువ్య, మధ్య భారతదేశ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వివరించారు. ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని ఐఎండీ డైరెక్టరేట్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు.