IMDB… ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికమైన సంస్థ. ఈ సైట్ లో రేటింగ్ చూసి సినిమాలపై ఓ అంచనాకు వస్తారు చాలామంది. అంతేకాదు, అమెజాన్ లాంటి స్ట్రీమింగ్ కంపెనీలు కూడా ఈ కంపెనీ రేటింగ్ ను ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి 2022 సంవత్సరానికి గాను నంబర్ వన్ ఎవరనే అంశంపై ప్రకటన వచ్చింది.
IMDB రేటింగ్ ప్రకారం, ఈ ఏడాది మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్ గా ధనుష్ నిలిచాడు. అతడి తర్వాత రెండో స్థానంలో అలియా భట్, మూడో స్థానంలో ఐశ్వర్యరాయ్ పాపులర్ స్టార్స్ గా నిలిచారు.
ఇక టాలీవుడ్ విషయానికొస్తే.. 4వ స్థానంలో రామ్ చరణ్, 8వ స్థానంలో ఎన్టీఆర్, 9వ స్థానంలో యష్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. స్టార్స్ కు సంబంధించి IMDB పేజీని అభిమానులు ఎన్నిసార్లు వీక్షించారనే నంబర్ పై ఈ ర్యాంకుల్ని ప్రకటించింది సందరు సంస్థ. ఇక టాప్-10లో ఉన్న తారలు ఎవరో ఓసారి చూద్దాం..
1. ధనుష్
2. అలియా భట్
3. ఐశ్యర్య రాయ్
4. రామ్ చరణ్
5. సమంత
6. హృతిక్ రోషన్
7. కియరా అద్వానీ
8. ఎన్టీఆర్
9. అల్లు అర్జున్
10. యష్