వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో అంచనా వేసినట్లుగా అధిక వృద్ధి రేటును భారత్ అందుకుంది. అయితే ఈ వార్త భారత్ కే కాకుండా ప్రపంచానికి కూడా సానుకూల వార్త అని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా అన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ కు 8.2 శాతం బలమైన వృద్ధిని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ మారింది. ఇది చైనా 4.4 శాతం కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ.
అధిక రేటుతో వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని జార్జివా అన్నారు. ఈ ఏడాది కొద్ది పాటి తగ్గుదల ఉన్నప్పటికీ భారత వృద్ధిని 8.2 శాతంగా అంచనా వేసినట్టు తెలిపారు.
అయితే వృద్ధి మందగమనం ప్రధాన సమస్యను సృష్టించే ప్రపంచంలో సానుకూలమైనది. ,” అని జార్జివా బుధవారం IMF మరియు ప్రపంచ బ్యాంకు వార్షిక వసంత సమావేశం సందర్భంగా ఇక్కడ ఒక వార్తా సమావేశంలో విలేకరులతో అన్నారు.
ఇది భారత్ కు ఆనందం కలిగించే విషయం. వృద్ధి మందగమనం ప్రధాన సమస్యలను సృష్టిస్తున్న సమయంలో ఈ వార్త ప్రపంచానికి సానుకూల అంశమని ఆమె వివరించారు. కరోనా పాండెమిక్ సమయంలో వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడంలో అంతర్జాతీయంగా భారత్ ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు.