భారత దేశ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందంటూ ఐ.ఎం.ఎఫ్ ( అంతర్జాతీయ ద్రవ్య నిధి) మరోసారి హెచ్చరించింది. ప్రమాదకర ఆర్ధిక పరిస్థితి నుంచి గట్టెక్కడానికి భారత్ అత్యంత వేగంగా, నిర్మాణాత్మక, సమీకృత ఆర్ధిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై స్పందించిన ఐ.ఎం.ఎఫ్ అధికార ప్రతినిధి జెర్రీ రైస్..భారత దేశంలో ఆర్ధిక పరిస్థితులు గతంలో అంచనా వేసిన దాని కంటే బలహీనంగా ఉన్నాయని అన్నారు. ఆదాయ-వ్యయాల మధ్య తేడాని నియంత్రిస్తూ మధ్య కాలిక ఆర్ధిక వ్యూహాల్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వివిధ రంగాల పునరుత్తేజానికి ప్రభుత్వం కొనసాగిస్తున్న చర్యలపైనే బడ్జెట్ లో దృష్టి సారించారని పేర్కొన్నారు.
ఇటీవల స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-2020 వార్షిక సర్వ సభ్య సమావేశంలో కూడా భారతదేశ ఆర్ధిక పరిస్థితిపై ఐ.ఎం.ఎఫ్ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.