కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు పై కీలక పరిణామం చోటుచేసుకుంది.ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా..వద్దా అన్న దానిపై అభిప్రాయాన్ని ఇచ్చేందుకు ఏజీ వెంకటరమణి నిరాకరించారు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కేంద్రం కోరింది.
అయితే గతంలో ఏపీ తరపున కేసుల్లో హాజరైనందుకు తను అభిప్రాయాన్ని ఇవ్వలేనని ఏజీ స్పష్టం చేశారు. దీంతో అభిప్రాయం కోసం ఫైల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా కు కేంద్రం పంపించింది. తుషార్ మోహతా అభిప్రాయం తెలుసుకున్న తరువాత కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ కి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాతే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చేయాలంటూ గతంలో సుప్రీం కోర్టును తెలంగాణ ఆశ్రయించింది. అయితే తెలంగాణ పిటీషన్ ను ఉపసంహరించుకుంటే కొత్త ట్రైబ్యునల్ఏర్పాటు పై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది.
దీంతో సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ ను తెలంగాణ ఉపసంహరించుకుంది. అయితే కొత్తట్రైబ్యునల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం ఉన్న బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ చేతనే విచారిస్తే సరిపోతుందని కేంద్ర న్యాయశాఖ తొలుత అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో కేంద్ర న్యాయ శాఖ అభిప్రాయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కేంద్రం పంపించింది. తుషార్ మెహతా అభిప్రాయం తరువాత కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు పై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.