పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలకు మీమ్స్ జత చేసి వాటిని నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బ్రిటన్ లో తాను చాలా కాలం గడిపానన్నారు. అక్కడ తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని వెల్లడించారు. అయితే తానెప్పుడూ బ్రిటన్ ను తన సొంత ఇంటిగా భావించలేదన్నారు. ఎందుకంటే తాను ఒక పాకిస్తానీ అన్నారు.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాను బ్రిటన్ పౌరుడిగా ఉండలేనన్నారు. గాడిదకు రంగులు వేసి గీతలు గీసినంత మాత్రాన అది జీబ్రా(కంచర గాడిద)గా మారుతుందా అని అడిగారు. గాడిద ఎప్పుడూ గాడిదగానే ఉంటుందన్నారు.
దీనిపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఖాన్ ను నెటిజన్లు ఆడుకుంటున్నారు. 69 ఏండ్లకు జ్ఞానోదయం అయిందని కొందరు అంటుండగా… ఆత్మన్యూనత భావం అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.