ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం ఆపరేషన్ గంగ చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే 17000 మందికి పైగా భారతీయులను ఇండియాకు తరలించింది.
తాజాగా భారతీయుల తరలింపులో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించడంలో తొలిసారిగా రష్యా సైన్యం సహాయం చేసింది.
దక్షిణ ఉక్రెయిన్ లోని ఖేర్ సన్ నగరాన్ని రష్యా తన కంట్రోల్ లోకి తీసుకుంది. అయితే ఆ నగరంలో ముగ్గురు భారతీయులు చిక్కుకున్నారు. వారిని రష్యా సైన్యం కాపాడి రష్యా మీదుగా భారత్ కు తరలించడంలో సహాయం చేసింది.
దీనిపై రష్యా ఎంబసీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ మేము వారిని బస్సు ద్వారా క్రిమియాలోని సిమ్ ఫర్ పోల్ నగరానికి తరలించాము. అక్కడి నుంచి రైలు ద్వారా వారిని రష్యాకు చేర్చాము. ఆ తర్వాత వారు ఫ్లైట్ లో భారత్ కు వెళ్లిపోయారు. వారిలో ఇద్దరు వ్యాపారులు, ఒక విద్యార్థి ఉన్నారు” అని తెలిపారు.