ఒకటే జననం, ఒకటే మరణం. గెలుపు పొందు వరుకు అలుపు లేదు మనకు. బతుకు అంటే గెలుపు. గెలుపు కొరకు బతుకు. అని ఓ సినీకవి రాసిన లైన్లు. ఒక్క సారే పుడతాం. ఒక్క సారే చస్తాం. వంద జన్మలు లేవు. నువ్వు అనుకున్నది ఈ జన్మలోనే చేసి తీరు అని రెండు వాఖ్యాల్లో నూరేళ్ళ జీవితాన్ని నింపాడు.
పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిదంటూ ఉండదనేందుకు కళ్ళముందు ఎన్నో సాక్ష్యాలున్నాయి. చూసే మనసు ఉండాలి. అలాంటి అవకాశం వచ్చినప్పుడు చూసి ఆత్మవిమర్శ చేసుకోవాలి.ఆత్మవిశ్వాన్ని పొందాలి. ముందుకు సాగిపోవాలి.
జీవితం ఎన్నో ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న కష్టాలకు కన్నీళ్ళు పెట్టుకుని కుంగిపోయేవారిలో సానుకూల స్ఫూర్తి నింపేలా ఐపీఎస్ అధికారి దీపాన్షు కాబ్రా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో రెండు కాళ్లను కోల్పోయిన వ్యక్తి శిఖరంపైకి ఎక్కేందుకు ప్రయత్నించడం అందరినీ ఆకట్టుకుంటోంది. కాళ్లు లేని ఆ వ్యక్తి కృత్రిమ పరికరాలతోనే శిఖరాన్ని అధిరోహించేందుకు ప్రయత్నిస్తుండటం నెటిజన్లలో పాజిటివిటీని పెంచుతోంది. మీ కలలను వెంటాడటం నుంచి మిమ్నల్ని ఏదీ ఆపలేదు అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
Nothing can stop you from chasing your dreams… pic.twitter.com/sUp4EkoW7Q
— Dipanshu Kabra (@ipskabra) January 3, 2023