ఇన్ స్టాగ్రామ్ యూజ్ చేసే వారికి ఇన్ ఫ్లుయెన్సర్ మెకిన నైప్ అనే యువతి గురించి తెలిసే ఉంటుంది. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూంటాయి.
View this post on Instagram
మెకిన నైప్ అసాధ్యమైన పనులను సుసాధ్యం చేస్తూ.. నెట్టింట హల్చల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఆమె మరో వీడియోతో నెటిజన్స్ షాక్ కి గురిచేసింది. స్కైడైవింగ్ చేస్తూ బర్గర్ తింటూ ఔరా అనిపించింది మెకిన నైప్.
అయితే అసలు ఆమె ఎవరు? ప్రత్యేకత ఏముందని అడిగే వారికి ఈ లేటెస్ట్ వీడియో ఓ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. స్కైడైవింగ్ చేస్తూ మెకిన నైప్ బర్గర్ టేస్ట్‌ను ఎంజాయ్ చేయడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. తాజా వైరల్ వీడియోలో ప్యాక్ విప్పుతూ ఆమె బర్గర్‌ను తినడం కనిపించింది.
ఆకాశంలో ఎంచక్కా మెకినా నైప్ కొద్దిపాటి డ్యాన్స్ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేసింది. ఈ వీడియోకి ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ రాగా.. పెద్ద ఎత్తున రియాక్షన్స్ కూడా వచ్చాయి. పదివేల అడుగుల ఎత్తులో బర్గర్ ఇంకా టేస్టీగా ఉంటుందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.