సహజంగా అమ్మాయిల కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చూసి ఉంటారు. బెంగళూరులో ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిల మధ్య తలెత్తిన గొడవ.. రెండు స్కూల్స్ కు మధ్య వైరంలా మారింది. దీంతో రెండు పాఠశాలలకు చెందిన అమ్మాయిలు పట్టపగలే జుట్లు పట్టుకొని నడి రోడ్డుపై కొట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం విఠల్ మాల్యా రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తతంగమంగా వీడియో తీసిన వారు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని బిషాప్ కాటన్ గర్ల్స్ స్కూల్ విద్యార్థినులు, మరో పాఠశాలకు చెందిన అమ్మాయిలకు మధ్య గొడవ ఏర్పడింది. బిషాప్ కాటన్ గర్ల్స్ స్కూల్ అమ్మాయిలు యూనిఫాం ధరించగా.. మరో స్కూల్ కు చెందిన విద్యార్థినులు సివిల్ డ్రస్సులో ఉన్నారు. బేస్ బాల్ బ్యాట్ ను ఒకరికొకరు మార్చుకుంటూ దాడులు చేశారు. ఒకరినొకరు వెంట్రుకలు పట్టుకుని లాగి కొట్టుకున్నారు. రోడ్డుపై పడేసి ఈడ్చుకెళ్లారు. ఈ దాడుల్లో పలువురు అమ్మాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది.
అమ్మాయిల మధ్య చోటు చేసుకున్న గొడవను విడిపించేందుకు ఏ ఒక్కరూ కూడా సాహసం చేయలేదు. అయితే.. ఈ ఘటనపై ఇప్పటి వరకు అటు పోలీసులు కానీ.. ఇటు స్కూల్ మేనేజ్‌మెంట్ కానీ.. ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇద్దరమ్మాయిలకు సంబంధించిన ఓ బాయ్ ఫ్రెండ్ విషయంలోనే గొడవ తలెత్తినట్టు స్థానికులు చెప్తున్నారు.అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
గ్యాంగ్స్ ఆఫ్ బెంగుళూర్ అన్న రీతిలో ఈ స్ట్రీట్ ఫైట్ సాగింది. స్కూల్ డ్రెస్సులో అమ్మాయిలు కొట్టుకున్న తీరు ఓ కొత్త ట్రెండ్ కు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఇలాంటి ఘటనలే కొన్ని జరిగాయి. మే ఒకటో తేదీన తమిళనాడులోని మధురై బస్ స్టాప్‌లో రెండు గ్రూపులుగా ఏర్పడి అమ్మాయిలు కొట్టుకున్నారు. ఇక ఏప్రిల్ 26 న కూడా చెన్నైలో రెండు కాలేజీలకు చెందిన విద్యార్థినుల మధ్య గొడవ దుమారం లేపింది. అలాంటి ఘటనలు మరువక ముందే అప్పుడు మరో గ్యాంగ్ పంచ్ లు విసురుకుంది.