అంతర్జాతీయ క్రికెట్ లో ఉండే రూల్స్ ఎప్పుడూ కూడా ఆసక్తికరంగానే ఉంటాయనే మాట వాస్తవం. అంతర్జాతీయ క్రికెట్ లో బెయిల్స్, స్టంప్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. అవుట్ అవ్వడానికి ఇవే కీలకం కాబట్టి వీటి మీద బౌలర్ లేదా ఫీల్డర్ ఫోకస్ ఎక్కువ. ఇక బంతి తగిలినా సరే ఒక్కోసారి బెయిల్స్ పడవు. సరే అసలు బెయిల్స్ లేకుండా కూడా క్రికెట్ మ్యాచ్ లు జరుగుతాయా…?
Also Read:వాట్సాప్ కంటే టెలిగ్రాం ఎందుకు బెస్ట్…?
కచ్చితంగా మ్యాచ్ లు జరుగుతాయి. బాల్ వికెట్ల మీదున్న బెయిల్స్ కింద పడితే మాత్రమే అవుట్ గా అంపైర్ లు ప్రకటిస్తారు. కాని కొన్నికొన్ని సార్లు బలంగా గాలులు వీస్తే మాత్రం బెయిల్స్ వాటంతటవే క్రిందపడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మాత్రం ఫీల్డ్ అంపైర్లు బెయిల్స్ ని తీసేసి గేమ్ కు ఓకే చేస్తారు. ఆ సమయంలో బంతితో వికెట్లను గిరాటేయడం లేదంటే పీకడం చేస్తే మాత్రమే అవుట్ అయినట్టు లెక్క.
ఇక థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ నిర్ణయం సమీక్షిస్తే మాత్రం బెయిల్స్ ఉన్నట్లుగానే భావించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భం ఒకసారి జరిగింది. 2019 యాషెస్ నాలుగో టెస్టులో మొదటి రోజున తీవ్రమైన గాలులూ, వర్షం పడ్డాయి. గాలి కారణంగా ఫీల్డ్ అంపైర్ లు బెయిల్స్ తీసేసి మ్యాచ్ నిర్వహించారు. ఇక ఇప్పుడు బెయిల్స్ పై విమర్శలు వస్తున్నాయి. బాల్ తగిలినా బెయిల్స్ పడట్లేదు. గతంలో చెక్క బెయిల్స్ మాత్రం బాల్ అలా తగిలిన వెంటనే పడిపోతు ఉంటాయి.
Also Read:మంచు ఎఫెక్ట్.. వరుసగా 60 వాహనాలు ఢీ.. వీడియో ఇదిగో..!