దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే 20,409 మందికి కొవిడ్ నిర్థారణ కాగా…. 32 మంది ప్రాణాలు కోల్పొయారు. కొవిడ్ నుంచి ఇప్పటి వరకు 22,697 మంది కోలుకున్నారు. కాగా రికవరీ రేటు 98..48 శాతానికి చేరింది.
దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసులు 4,39,79,730. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,26,258.
ప్రస్తుతం దేశంలో ఉన్నయాక్టివ్ కేసుల సంఖ్య 1,43,988. కాగా ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,33,09,484.
భారత్‌లో నిన్న 38,63,960 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 203.60 కోట్లు దాటింది. మరో 3,98,761 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు.
ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 9,26,447 మంది వైరస్ బారినపడగా.. మరో 2,028 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,93,87,454కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,14,119 మంది మరణించారు. ఒక్కరోజే 8,50,731 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య54,93,36,123కు చేరింది.
జపాన్‌లో 2,07,236 కేసులు నమోదు కాగా.. 122 మంది మరణించారు.అమెరికాలో తాజాగా 93,216 కేసులు నమోదు కాగా.. 260 మంది ప్రాణాలు కోల్పోయారు.దక్షిణ కొరియాలో కొత్తగా 88,296 మందికి కరోనా సోకింది. 25 మంది బలయ్యారు.జర్మనీలో తాజాగా 84,798 మందికి కరోనా సోకింది. 153 మంది మరణించారు.ఇటలీలో కొత్తగా 60,381 మందికి వైరస్ సోకగా.. 199 మంది మరణించారు.