జమ్ము కశ్మీర్ లో గత మూడు నెలల్లో 42 మంది ఉగ్రవాదులు హతమైనట్టు జమ్ముకశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్ బాగ్ సింగ్ వెల్లడించారు. సోమవారం వరుసగా ఉగ్రదాడులు జరిగాయని, ఈ దాడిలో ఒక సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మరణించగా, మరో నాలుగురు గాయపడ్డారని ఆయన తెలిపారు.
ఘటనపై ఆయన స్పందిస్తూ… దీన్ని పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. మరణించిన కానిస్టేబుల్ కు నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నట్టు తెలిపారు.
‘ గత మూడు నెలల్లో 42 మంది ఉగ్రవాదులను హతమార్చాం. అనేక మంది గ్రౌండ్ వర్కర్లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాము. ఎవరైనా తప్పుడు తోవలో నడిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము‘ అని తెలిపారు.
Advertisements
పౌరులపై దాడులను ఆయన ఖండించారు. దాన్ని అనాగరిక చర్య అని, క్రూరత్వానికి సంకేతంగా వర్ణించారు. శాంతి, ప్రశాంతతను కాపాడేందుకు తాము తమ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంటామని చెప్పారు.