లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘లియో’ (బ్లడీ స్వీట్). సెవెన్ స్ర్కీన్ స్టూడియో బ్యానరుపై నిర్మాత లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ‘మాస్టర్’ తర్వాత లోకేష్ – విజయ్ – లలిత్ కుమార్ కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
దీనికితోడు అర్జున్, సంజయ్ దత్, త్రిష, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, దర్శకుడు మిస్కిన్, గౌతం వాసుదేవ్ మీనన్, డాన్స్ మాస్టర్ శాండి, మలయాళ నటుడు మ్యాథ్యూ థామస్ వంటి వారు నటిస్తుండటంతో ఈ అంచనాలు రెట్టింపయ్యాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల చిత్ర యూనిట్‌తో కలిసి సంజయ్ దత్ ఇందులోని తన పాత్రకు సంబంధించి షూటింగ్‌ను పూర్తి చేశారు. కశ్మీర్‌లో ఈ చిత్రీకరణ జరిగింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ‘ధన్యవాదాలు సంజయ్ సార్. నేను, మా సిబ్బంది మీ పనితీరును దగ్గర నుంచి చూసి ఆనందించాం.
మీరు గొప్ప వ్యక్తి. చెన్నై షెడ్యూల్‌లో మిమ్మల్ని కలిసేందుకు ఎదురు చూస్తుంటాం. మళ్ళీ కలుసుకుందాం సార్’ అంటూ నిర్మాత లలిత్ కుమార్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.