మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు మరో సారి తల నొప్పి మొదలైంది. ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక రూపంలో సమస్య ఆయన ముందుకు వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలపాలని విషయంలో పంచాయితీ మొదలైనట్టు తెలుస్తోంది.
ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపాలని మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై శివసేన నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ విషయమై శివసేన ఎంపీ రాహుల్ శివాలే ఠాక్రేకు లేఖ రాశారు.
‘ ద్రౌపది ముర్ము గిరిజన నేత. ఆమె ఎంతో సమాజ సేవ చేశారు. అలాంటి నేతకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అందు వల్ల పార్టీ తరఫున ఆమెకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నాను. ఈ మేరకు శివసేన ఎంపీలందరికీ ఆదేశాలు ఇవ్వండి’ అని లేఖలో పేర్కొన్నారు.
బీజేపీ మద్దతుతో శివసేన తిరుగుబాటు నేత షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.