మహారాష్ట్రలో ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి కొవిడ్-19 వైరస్ సోకింది. వారంతా ఇరుకైన ఒకే ఇంట్లో ఉండడం వల్ల వైరస్ వ్యాపించినట్టు అధికారులు తెలిపారు. ఇస్లాంపూర్ తహశీల్ పరిధి సంగ్లీలోని ఓ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సౌదీ అరేబియాకు వెళ్లి తిరిగొచ్చాక మార్చి 23 న వారికి వైరస్ నిర్ధారణ జరిగింది. ఆ తర్వాత వారం రోజులకు అదే కుటుంబంలో రెండేళ్ల పిల్లవాడితో సహా మరో 21 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. వారంతా ఒకరికొకరు కలిసి మెలిసి ఉండడం వల్లనే అంత మందికి వైరస్ వ్యాపించింది. అయితే ఇది ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితమైందని..వారు కాకుండా ఇతరుకు వ్యాపించలేదని జిల్లా కలెక్టర్ అభిజిత్ చౌదరి తెలిపారు.
వైరస్ సోకిన వారందరూ ఒకే పెద్ద కుటుంబానికి చెందిన వారని…వారంతా పక్క పక్కనే నివసిస్తుండడమే దీనికి కారణమని డిస్ట్రిక్ట్ సివిల్ సర్జన్ సి.ఎస్. సలుంకే చెప్పారు. కుటుంబ సభ్యులందరు దాదాపు 24 గంటలు ఒకరినొకరు కలవడం వల్ల వైరస్ వ్యాపించిందన్నారు. ఈ కుటుంబం నుంచి ఇతరు వ్యాపించిందనే విషయాన్ని కొట్టి పారేశారు.” ఒకవేళ ఒక కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తి ఇంట్లో దగ్గితే ఆ ఇంట్లోని వస్తువుల మీద తుంపర్లు పడతాయి. కామన్ వస్తువులను ఇంట్లోని ప్రతి ఒక్కరు వాడుతుండడం వల్ల అందరి వైరస్ వ్యాపిస్తుందని” డాక్టర్ సలుంకే వివరించారు.
ఒక కుటుంబంలో వైరస్ పాజిటివ్ గా ఉందని గుర్తించడం మంచిదైంది. దీంతో ఇతరు లందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లేకపోతే వైరస్ పాజిటివ్ వచ్చిన వారంతా కమ్యూనిటీలో తిరగడం వల్ల చాలా మందికి సోకేదని డాక్టర్లు తెలిపారు. ఇస్లాంపూర్ లోని వారుండే ప్రాంతానికి కిలో మీటర్ పరిధిలోకి ఎవరిని రానివ్వకుండా చేశారు అధికారులు.