హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌజ్ కీలక రాజకీయ భేటీకి వేదికైంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సమావేశం అత్యంత గోప్యంగా కొనసాగుతుంది. ఇక ఈ ఫామ్ హౌజ్ బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటలది కాగా, ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో ఈటల మీటింగ్ కొనసాగుతోంది.
సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ సమావేశానికి పొంగులేటి ఇంకా జూపల్లి ఇద్దరూ కూడా తమ పర్సనల్ సెక్యూరిటీతో పాటు గన్ మెన్లను కూడా చర్చ జరుగుతున్న ప్లేస్ లోకి రానివ్వలేదని సమాచారం. ఇక ఈ సమావేశంలో జూపల్లి ఇంకా పొంగులేటిని బీజేపీలోకి రావల్సిందిగా ఈటల ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే పొంగులేటిని పలుసార్లు పార్టీలోకి ఇప్పటికే ఆహ్వానించిన బీజేపీ చివరికి ఆయన ఇంటికి కూడా వెళ్ళింది.
అయితే అప్పుడు ఆయన ఆల్మోస్ట్ పార్టీలోకి చేరుతారని అందరూ అనుకున్నారు. కాని పొంగులేటి మాత్రం కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. ఇక కొన్నాళ్ల నుంచి పొంగులేటి బాటలోనే జూపల్లి కూడా నడుస్తున్న క్రమంలో కర్ణాటకలో కాంగ్రెస్ విన్ కావడంతో వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకే వెళతారని అనుకున్నారు.
కానీ జూపల్లి ఇంకా పొంగులేటి ఇద్దరు కూడా వేర్వేరుగా ఇంకా పార్టీ మారే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని ప్రకటించారు. ఈనేపథ్యంలో ఈరోజు వీళ్లతో సింగిల్ గా ఈటల ఈ విధంగా భేటీ కావడంతో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సమావేశం ముగిసిన తరువాత వాళ్లిద్దరు ఏం ప్రకటిస్తారనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.