ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం మర్చిపోలేని విషయాలు కొన్ని ఉంటాయి. ఈ విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇక ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్ళిన వాళ్లకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పద్దతులు కనపడతాయి. అవి ఏంటి అనేది ఒక్కసారి చూద్దామా…?
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో స్త్రీలే కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. మార్కెట్ లో కనపడే టీ దుకాణాల్లో ఎక్కువగా ఆడవాళ్లే ఉంటారు. వారి పిల్లలను చూసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ టీ షాప్ నడుపుతూ ఉంటారు.
Also Read: లుక్ రెడీ…టార్గెట్ హరిహర వీరమల్లు
ఇక షిల్లాంగ్ లో పోర్క్ వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ పందుల కోసం ప్రత్యేకంగా ఒక గౌడాన్ పెడతారు. మనం చికెన్ ఎలాగో అక్కడ పోర్క్ అలా తింటారు.
ఇక మహారాష్ట్రలో పూణే విషయానికి వస్తే అక్కడ నీరు ఒకప్పుడు చాలా తేలికగా ఉండేది అని చెప్తారు. ఏం తిన్నా సరే వెంటనే అరిగిపోతుందని అంటారు.
కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లో బౌద్ధ భిక్కువులు మాణి అనే ఒక ఢక్కను వారి చేత్తో నిరంతరం తిప్పుతూ ఏ పని చేసినా సరే “ఓం మణిపద్మే హమ్” అనే మంత్రజపం చేస్తారు.
Advertisements
Also Read: విజయ్ దేవరకొండ తో జాన్వీ కపూర్ ?