ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం పరివారానికి సంబంధించిన 19 మంది హిందూ మతాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే 12 ఏళ్ల క్రితం వీరంతా హిందూ మతానికి చెందిన వారేనని 12 ఏళ్ల క్రితం ఇస్లాం మతాన్ని స్వీకరించగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన గర్ వాపసీ ద్వారా ఇస్లాం నుండి హిందూ మతం లోకి వచ్చినట్టు ఆ కుటుంబం పెద్ద వెల్లడించారు. అయితే హిందూ మతాన్ని స్వీకరించిన వారు కాంద్లా లోని సూరజ్ కుందా ఆలయం లో నిర్వహించిన శుద్ది హోమం ద్వారా తిరిగి హిందూ మతం స్వీకరించారు.
అప్పట్లో తన తండ్రిని బెదిరించి భయపెట్టి మత మార్పిడి చేసినట్టు కుటుంబ పెద్ద తెలిపారు. ఇప్పుడు తమ కుటుంబం అంతా మళ్ళీ హిందూ మతం స్వీకరించింది అని చెప్పారు. ఇక వారిలో పెద్ద వాళ్ళ నుండి చిన్న పిల్లల వరకు ఉన్నారు. వీళ్లంతా బంజారా సమాజానికి చెందిన వారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ముజాఫ్ఫర్నగర్ లో ఉంటున్న మహంత్ జస్విర్ మహారాజ్ హాజరై దగ్గరుండి కార్యక్రామాన్ని నిర్వహించారు. ఈ కుటుంబం గత కొద్ది రోజుల నుంచి మహంత్ జస్విర్ మహారాజ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.