కేవలం 45 రూపాయలకే..ఐదు రోజుల్లో కోవిడ్ ను పూర్తిగా నయం చేస్తానని చెబుతున్నా.. తనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మూడు రోజుల నుంచి సుల్తాన్ బజార్ యూపీహెచ్సీలో డాక్టర్ వసంత్ తలుపులు వేసుకొని దీక్ష చేస్తున్నారు. దీనిపై గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
డాక్టర్ ఇంటికి చేరుకొని..ఆయన ఆందోళనకు సంఘీభావం వ్యక్తం చేశారు. తలుపులు తెరిచి బయటికి రావాలని డాక్టర్ ను రాజాసింగ్ కోరితే.. పోలీసులు వెళ్ళిపోతేనే బయటకి వస్తానని డాక్టర్ వసంత్ మొండికేశారు. చివరికి తలుపులు తెరవడంతో అతనితో మాట్లాడిన ఎమ్మెల్యే రాజాసింగ్.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని హామీ ఇచ్చారు.
డాక్టర్ వసంత్ విషయం మాట్లాడడానికి ఫోన్ చేస్తే మంత్రి హరీష్ రావ్ స్పందించ లేదన్న రాజాసింగ్.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పని చేసిన వైద్యుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడం దారుణమన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఈ విషయం చెప్పానని.. ఆయన హైదరాబాద్ రాగానే..డాక్టర్ వసంత్ తో మాట్లాడుతారని రాజాసింగ్ అన్నారు.
అయితే డాక్టర్ వసంత తాను చేసిన రీసెర్చ్ ను ఇప్పటికైనా.. రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు