- తులసి రెడ్డి, కాంగ్రెస్ నేత.
రాష్ట్ర విపత్తు సహాయ నిధులను వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు మళ్ళించడం పై సుప్రీంకోర్టు మందలింపు వైసీపీ ప్రభుత్వానికీ ఒక చెంపపెట్టు. రాష్ట్ర విపత్తు సహాయ నిధులను వ్యక్తిగత డిపాజిట్ ల అకౌంట్లకు మళ్లించడం ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యమే.
వరద సహాయక చర్యలు చేపట్టడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. పసి బిడ్డలకు పాలు, మిగతా వారికి తిండి, పశువులకు మేత కూడా అందని పరిస్థితి నెలకొంది. వైసీపీ చేపట్టిన గడప గడప కార్యక్రమం పిల్లికి చెలగాటం – ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టు తయారయ్యింది. గడప గడపలో పాల్గొనకుంటే, ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వమంటున్నాడు సీఎం.
ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది ఇప్పుడు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి. ఈ లెక్క ప్రకారం చూస్తే పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ మోహన్ రెడ్డి కూడా గడప గడపలో పాల్గొనాలి. కానీ ఇప్పుడు ఆ పార్టీలో ఆయనకు ఒక న్యాయం, మిగతా ఎమ్మెల్యే లకు ఒక న్యాయం అన్నట్టుగా మారింది.
సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన 3000 మంది పోలీసులు, భారికేడ్ల మధ్య జరుగుతోంది. మరి! మిగతా ఎమ్మెల్యే ల పరిస్థితి ఏమిటి..? సీఎంకో న్యాయం.. ఎమ్మెల్యేలకో న్యాయమా అంటూ జగన్ సర్కార్ మీద ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.