అంపాలాల్, ఆదిత్యరామ్ సహా నాలుగు రియల్ ఎస్టేట్ వాణిజ్య సంస్థల్లో ఆదాయపన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగవ రోజు కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ సంస్థలు భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డాయంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆయా సంస్థలకు సంబంధించి ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు దాడులు చేశారు.
ఈ మేరకు ఆయా సంస్థల కార్యాలయాలతో పాటు నిర్వాహకులు, ఉన్నతస్థాయి అధికారుల నివాసాలు, ఇతర ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో స్థానిక అయ్యప్పన్ తాంగళ్, అన్నానగర్ ప్రాంతంతో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు. ఈ దాడుల సమయంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
వేలూరు కేంద్రంగా పని చేస్తున్న అంపాలాల్ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయాలు, నిర్వాహకుల ఇళ్ళలో చేసిన దాడుల్లో భారీగా నగదు, నగలు పట్టుబడినట్టు అధికారులు చెప్పారు.