కేంద్ర దర్యాప్తు సంస్థలు హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఓవైపు అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కేసులపై నోటీసులు, తనిఖీలు, విచారణలు జరుపుతూనే.. ఇంకోవైపు వ్యాపారవేత్తలనూ వదలడం లేదు. తాజాగా నగరంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు, కన్ స్ట్రక్షన్ కార్యాలయాలు, ఓ బిల్డర్ ఇంట్లో ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తోంది ఐటీ.
మొత్తం 50 పైగా ప్రాంతాల్లో ఐటీ రెయిడ్స్ కొనసాగుతున్నాయి. శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఊర్జిత కన్ స్ట్రక్షన్స్, సీఎస్కే బిల్డర్స్ తదితర కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతున్నారు అధికారులు. శ్రీ ఆదిత్య హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి, అతని కుమారుడు ఆదిత్య రెడ్డి ఇళ్లు, కార్యాలయ్యాల్లో సోదాలు చేస్తున్నారు.
ఊర్జిత కన్ స్ట్రక్షన్స్ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో, కార్యాలయంలో రెయిడ్స్ కొనసాగుతున్నాయి. మరో బిల్డర్ మాధవరెడ్డి ఇంట్లో, సీఎస్కే కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఐటీ రిటర్న్స్ లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు.. గడిచిన ఐదు సంవత్సరాల వివరాలను అకౌంట్ డిపార్ట్మెంట్ నుండి తీసుకొని ఆరా తీస్తున్నారు.