వేతన జీవులు, మధ్యతరగతి వర్గాలకు బడ్జెట్‌లో ఊరట లభించింది. ఆదాయపన్ను పరిమితిని పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న కనిష్ఠ ఆదాయ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఆదాయ పరిమితి రూ. 7 లక్షలు దాటిన వారిపై 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.7 నుంచి రూ.9 లక్షల వరకు 5 శాతం పన్ను విధించనున్నారు. ఆదాయం రూ.30 లక్షలు దాటిన వారిపై 30 శాతం పన్ను విధించనున్నట్టు బడ్జెట్ లో పేర్కొన్నారు.
ఇది నూతన పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుందని కేంద్రం మంత్రి తెలిపారు. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురాలేదన్నారు. ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనేది పూర్తిగా చెల్లింపుదారుని ఇష్టంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. రెండింటిలో ఏ పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటుందో దాన్ని ఎంచుకోవచ్చని చెప్పారు.
పన్ను మినహాయింపుల విషయంలో ఆర్థిక నిపుణుల వేసిన అంచనాలు నిజమయ్యాయి. రెండేళ్లక్రితం తీసుకు వచ్చిన నూతన పన్ను విధానంలోనే వేతన జీవులను ఆకర్షించేందుకు స్లాబుల్లో మార్పులు తీసుకు రావచ్చని ఆర్థిక నిపుణలు అంచనా వేశారు. వారు అంచనా వేసినట్టుగానే మార్పులు జరిగాయి.
0 నుంచి రూ. 3 లక్షలు – సున్నా
రూ. 3 లక్షలు నుంచి రూ.6 లక్షలు – 5 శాతం
రూ. 6 లక్షలు నుంచి రూ.9 లక్షలు – 10 శాతం
రూ. 9 లక్షల నుంచి రూ.12 లక్షలు – 15 శాతం
రూ. 12 లక్షల నుంచి రూ.15 లక్షలు – 20 శాతం
రూ. 15 లక్షల పైబడిన ఆదాయం – 30 శాతం