నిమిషం పని చేస్తే చాలు… లక్షల్లో కూలి డబ్బులు. తట్ట పట్టుకున్నా, మట్టి ముట్టకున్నా టీఆర్ఎస్ నేతలకు కాసుల వర్షం కురిసింది. అందుకే సీఎం కేసీఆర్ దగ్గర నుండి మండల స్థాయి నాయకుల వరకు గులాబీకూలీ పేరిట పార్టీ ఫండ్ కోసం పని చేశారు. కానీ లక్షలకు లక్షలు ఎవరిస్తారు….? ఎందుకిస్తారు…? ఇందులో అవినీతి దాగి ఉంది అంటూ రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కోర్టుల్లో కొట్లాడారు. తాజాగా ఈ అంశంపై కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడిచిందని, కేంద్ర ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకుందని తెలుపుతూ… ఈ అంశం తమ పరిధిలోనిది కాదని అయితే… ఈ వ్యవహరంపై పోలీసులు లేదా ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దర్యాప్తు జరిపే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక సంస్థ సమాధానం ఇచ్చింది. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 17, 2020న ఎంపీ రేవంత్ రెడ్డికి సమాచారం అందించిందని తెలిపింది.