ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు మెరుపు దాడి చేశారు. బుధవారం ఉదయం నుంచి సురేష్ బాబు కి సంబంధించిన కార్యాలయాలు, రామానాయుడు స్టూడియో, సురేష్ బాబు ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక పత్రాలను స్వాదీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. నాలుగు బృందాలు గా ఒకే సమయంలో అధికారులు మెరుపు దాడి చేసినట్టు తెలుస్తుంది. స్వాధీనం చేసుకున్న పత్రాలపై సురేష్ బాబు ను ఆరాతీస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఇంకా తనికీలు కొనసాగుతున్నాయి.