తమిళనాడులో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. రాజకీయ నేతలతో పాటు కోలీవుడ్ సినీ ప్రముఖుల ఇండ్లలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

కోలీవుడ్ చిత్ర నిర్మాత, ప్రముఖ ఫైనాన్షియర్ అన్షు చెజియన్ నివాసంతో పాటు, ఆఫీసుల్లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
తాజాగా రాష్ట్రంలోని 40 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్‌ఆర్ ప్రభు, కలైపులి థాను, అన్బు జ్ఞానవేల్ రాజా, చెజియన్ సహా దాదాపు 10 మంది తమిళ నిర్మాతలు, ఇతరుల నివాసాల్లో తనిఖీలు చేస్తున్నట్టు ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు.
చెన్నై, మధురై సహా రాష్ట్రంలోని మొత్తం 10 చోట్ల అన్బుకు సంబంధించిన ఇండ్లు, ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించారు.