తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పలు రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో బుధవారం ఉదయం ప్రారంభించిన సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. శ్రీ ఆదిత్య, సీఎస్కే, ఊర్జిత, ఐరా రియల్ ఎస్టేట్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ప్లాట్ల విక్రయాలలో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలతో అధికారులు ఈ రైడ్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ పరిధిలోని 50 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా రియల్ ఎస్టేట్, సినిమా ఫైనాన్సర్లపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ఐటీ రిటర్న్స్ లో అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా విశాఖపట్నం, బెంగళూరులో కూడా ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఐటీ సిబ్బంది విచారణకు అకౌంట్ సిబ్బంది సహకరించపోవడం, కొన్ని కార్యాలయాల్లో దాడులకు వచ్చినప్పుడు అకౌంట్స్ సిబ్బంది కనిపించకపోవడంపై పలు అనుమానాలు దారితీస్తోంది. సోదాలు ముగిసే వరకు ఇళ్లకు పంపించమని ఐటీ అధికారులు చెప్పారు. అకౌంట్ సిబ్బంది నుండి బ్యాంక్ ట్రాన్స్ జాక్షన్స్ వివరాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు ప్లాట్ల వివరాలపై అవకతవకలున్నాయని అనుమానిస్తున్నారు.
ఇందులో భాగంగా.. ఆదిత్య రియల్ ఏస్టేట్ సంస్థకు చెందిన ఆఫీసులతో పాటు ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు సమర్పించిన ఆదాయ పన్నుకు సంబంధించి అవకతవకలు గుర్తించారు. ఆయా రియల్ ఎస్టేట్ సంస్థలు విక్రయించిన ప్లాట్ల విక్రయాల గురించి ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు.