ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఇన్‌స్టాకార్ట్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విషయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో… బెంగళూరులోని ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు జరుపుతోంది.
ఐటీ సోదాల విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ ధ్రువీకరించింది. అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపింది.